శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
పచ్చని చేలపై కన్నీటి వరద
ఈ ఫొటో చూడండి.. కనుచూపు మేరంతా వరద నీటిలో చిక్కుకున్న పొలాలే.. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనిదీ చిత్రం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏలేరు వరద నీరు ఒక్కసారిగా వెల్లువెత్తి, విరుచుకుపడింది. కూటమి ప్రభుత్వ అసమర్థత కారణంగా ఏలేశ్వరం జలాశయం నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో నీటిని వదిలేయడంతో పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు అతలాకుతలమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలను వరద ముంచెత్తింది. పెద్ద ఎత్తున బురదతో కూడిన వరద నీరు రావడంతో పొలాల్లో మట్టి మేటలు వేసింది. ఈ విపత్తు జరిగి ఇప్పటికి అక్షరాలా ఆరు నెలలైంది. వేలాది మంది రైతులు భారీగా నష్టపోయారు. అప్పుల పాలయ్యారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చామని చెప్పిందే.. తప్ప ఇప్పటికీ తమకు నయాపైసా అందలేదని చాలా మంది బాధిత రైతులు ఆవేదన చెందుతున్నారు.


