
ఇంటర్‌లో శ్రీ షిర్డీ సాయి విజయ బావుటా
కంబాలచెరువు: ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో విజయ బావుటా ఎగుర వేశారు. ఆ వివరాలను విద్యా సంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య శుక్రవారం విలేకర్లకు వెల్లడించారు.
ప్రధమ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీలో 470 మార్కులకు 465 మార్కులతో జి. మెహెర్ సత్య ప్రసాద్, ఎం.అభినవ్ వివేక్ ప్రధమ స్థానంలో నిలవగా, 464 మార్కులతో ఎన్‌వీపీ వర్షిత్, ఎం.తను శ్రావ్య శ్రీ, వై.బ్లెస్సీ ద్వితీయ స్థానాన్ని, 463 మార్కులతో బి.సాయి ప్రకాష్, కె.తేజస్విని, ఎస్.నిత్యశ్రీ, పి.భద్ర సాహితి, ఎన్.లలిత, ఆర్.హజీరా తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. బైపీసీలో 440 మార్కులకు 428 మార్కులతో ఎస్.తేజశ్రీ, ప్రథమ స్థానాన్ని, 416 మార్కులతో డి.దేవిసాయి ద్వితీయ స్థానాన్నీ సాధించారు. మొత్తం 16 మంది విద్యార్థులు 460 పైగా మార్కులు సాధించగా, 63 మంది 450 పైగా, 153 మంది 420కి పైగా, 207 మంది 400కి పైగా సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలలో ఎంపీసీలో వి.మణికంఠ 990 మార్కులతో ప్రధమ, ఎం.హాసిని, ఎన్.నందిని, వి.శివ కేశవ, జి.సాయి ముఖేష్ 987 మార్కులతో ద్వితీయస్థానాన్ని, ఎ.దివ్య 986 మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించారు.
బైపీసీలో 976 మార్కులతో కె.హిమశ్రీ ప్రధమస్థానాన్ని 974 మార్కులతో, కె.శిరీష ద్వితీయస్థానాన్ని సాధించారు. 13 మంది 980కి పైగా మార్కులు సాధించగా, 53 మంది 970కి పైగా, 107 మంది 950కి పైగా, 125 మంది 920కి పైగా, 203 మంది 900కి పైగా మార్కులు సాధించారని శ్రీవిద్య వివరించారు. ఈ విజయంపై విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని అభినందించారు.