
సామర్లకోట చైర్‌పర్సన్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం
సామర్లకోట: పట్టణ మున్సిపల్ కౌన్సిల్‌లో బలనిరూపణకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు బుధవారం జిల్లా కలెక్టన్ షన్మోహన్ సగిలి, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యకు వినతి పత్రాలు అందజేశారు. కొంత కాలంగా చైర్‌పర్సన్ గంగిరెడ్డి అరుణ తీరుపై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు అసంపూర్తితో ఉన్నారు. దాంతో 31 మంది సభ్యులు ఉన్న కౌన్సిల్ సభ్యులలో 22 మంది సంతకాలు చేసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ సగానికి మించి సభ్యులు బల నిరూపణ కోసం వినతి పత్రం అందజేస్తే దానిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుందన్నారు. అయితే బలనిరూపణ సమావేశం ఏర్పాటుకు కలెక్టరు నుంచి ఆదేశాలు రావలసి ఉందన్నారు. వినతి పత్రంలో సంతకాలు చేసిన వారి నుంచి సమాచారం సేకరించి తదపరి నిర్ణయం తీసుకొంటారన్నారు. పరోక్ష పద్ధతిలో చైర్‌పర్సన్ ఎన్నిక జరగడం వలన ఆమెను దింపే అధికారం మెజార్టీ సభ్యులకు ఉంటుందని కమిషనర్ తెలిపారు. వైస్‌చైర్మన్ ఉబా జాన్‌మోజెస్, కౌన్సిలర్లు ఆవాల లక్ష్మీసత్యనారాయణ, పాగా సురేష్‌కుమార్, నేతల హరిబాబు, యార్లగడ్డ జగదీష్, వైఎస్సార్ సీపీ నాయకుడు రెడ్నం దొరబాబు పాల్గొన్నారు.
బల నిరూపణకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్
కలెక్టర్‌కు, మున్సిపల్
కమిషనర్‌కు వినతి పత్రాలు