
కిళ్లీ కొట్లే బెల్ట్ షాపులు
సామర్లకోట మండలం జి.మేడపాడులోని మద్యం షాపునకు అనుబంధంగా పెదబ్రహ్మదేవం గ్రామంలో సుమారు 12 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ప్రతి పాన్‌షాప్‌లోనూ మద్యం విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ప్రతి కిళ్లీ కొట్టూ ఒక బెల్ట్ షాపుగా మారిపోతోంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ కిళ్లీ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఒక్కో బెల్ట్ షాపులో రూ.50 వేలకు మించి అమ్మకాలు జరుగుతున్నాయన్నది అంచనా. దీనినిబట్టి వాటి ఆదాయం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెల్ట్ షాపులు లేకుండా చేస్తామని ప్రకటనలు చేసిన చంద్రబాబు నాయుడు వీటిపై ఒక్కసారి దృష్టి సారించాలి.
– మలకల సూరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు, పీబీ దేవం, సామర్లకోట మండలం
పెదబ్రహ్మదేవం గ్రామంలోని బెల్ట్ షాపు

కిళ్లీ కొట్లే బెల్ట్ షాపులు