
ఎవ్వరికీ అందడం లేదు
ప్రతి నెలా రేషన్ తీసుకునే ఎండీయూ వాహనం, రేషన్ షాపు వద్ద ఈ నెల కందిపప్పు రాలేదనే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనప్పటికీ ఎవ్వరికీ కందిపప్పు సక్రమంగా అందడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా రేషన్ బియ్యంతో పాటు, కందిపప్పు, పంచదార ఇచ్చేవారు. ఇప్పుడు ఇవి రెండూ అప్పుడప్పుడు మాత్రమే ఇస్తున్నారు.
– నల్ల రాణి, వాకలపూడి, కాకినాడ రూరల్
ఒక్కసారి కూడా ఇవ్వలేదు
కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలైంది. ఒక్క నెలలో కూడా నాకు కందిపప్పు ఇవ్వలేదు. పేదలమైన మాపై కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతోంది. ఇప్పుడేమో ఈ–కేవైసీ సాకుతో రేషన్‌లో కోత పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికై నా పేదలకు ఇచ్చే రేషన్‌లో కోత పెట్టకుండా ప్రతి నెలా బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, ఇతర నిత్యావసర సరకులు ఇవ్వాలి.
– పోకనాటి ప్రభాకరమూర్తి, కాకినాడ

ఎవ్వరికీ అందడం లేదు