
నాన్ స్టాప్ కీబోర్డు ప్లేయర్‌గా విద్యశ్రీ గిన్నిస్ ర
రాయవరం: మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన విద్యశ్రీ కీబోర్డు ప్లే చేయడంలో గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ విషయాన్ని విద్యశ్రీ తల్లిదండ్రులు సురేష్, సుధారాణి గురువారం స్థానిక విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం విద్యశ్రీ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కీబోర్డుపై ఉన్న ఆసక్తితో విజయవాడకు చెందిన హల్లెలూయ మ్యూజిక్ స్కూల్‌లో ఆన్‌లైన్ తరగతులకు హాజరై కీబోర్డు ప్లే చేయడంతో పాటు, మెళకువలను నేర్చుకుంది. ఈ నెల 14న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో గిన్సిస్ రికార్డు ప్రతినిధుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నట్లు వారు తెలిపారు. గతేడాది డిసెంబరు 1న ఇన్‌స్ర్ట్రాగామ్ వేదికగా ఆన్‌లైన్‌లో గంట పాటు నిర్వహించిన పోటీలో విద్యశ్రీ పాల్గొంది. ఇదే పోటీలో 1,046 మంది ఒకే సమయంలో పాల్గొని గంట పాటు నిర్విరామంగా కీబోర్డు ప్లే చేశారు. గిన్నిస్ రికార్డులో భాగస్వామిగా ఉన్న విద్యశ్రీని గిన్సిస్ రికార్డు ఆఫ్ ఇండియా సంస్థ సర్టిఫికేట్, మెడల్‌ను ప్రదానం చేసింది. ఇంతకుముందు విద్యశ్రీ కీబోర్డు ప్లేయర్‌గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇన్‌జనియస్ వరల్డ్ రికార్డును సాధించిందన్నారు. కీబోర్డు ప్లేయర్‌తో పాటుగా, చిత్రలేఖనంలో విద్యశ్రీ రాణిస్తున్నట్లు తెలిపారు.

నాన్ స్టాప్ కీబోర్డు ప్లేయర్‌గా విద్యశ్రీ గిన్నిస్ ర