
270 కేజీల గంజాయి స్వాధీనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జాతీయ రహదారిపై దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్ట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడి చేశారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన సందీప్‌శర్మ, అదే రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ మోనుసైని ఏజెన్సీ ప్రాంతం నుంచి 270 కేజీల గంజాయిని కంటైనర్‌లో లోడ్ చేసుకుని బయలుదేరారు. దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న బొమ్మూరు పోలీసులు, ఈగల్ టీం సభ్యులు ఆ లారీ వచ్చే ప్రాంతంలో కాపు కాశారు. ఎన్‌ఎల్ 01 ఏజే 6162 కంటైనెర్‌ను ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. దీంతో లారీ డ్రైవర్ మోనుసైని పోలీసులకు చిక్కగా, మరో నిందితుడు సందీప్ శర్మ పారిపోయాడు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.13.50 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. లారీడ్రైవర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, అతడిపై తదుపరి చర్యల కోసం సెంట్రల్ జైలుకు రిమాండ్‌కు పంపారు. గంజాయిని తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన కంటైనర్‌ను సీజ్ చేశారు. కాగా.. గంజాయిని పట్టుకున్న బొమ్మూరు సీఐ పి.కాశీ విశ్వనాథంతో పాటుఈగల్ టీం, పోలీసు సిబ్బందిని ఎస్పీ నరసింహ కిశోర్, ఈస్ట్‌జోన్ డీఎస్పీ బి.విద్య అభినందించారు.
కంటైనర్‌లో తరలిస్తుండగా
పట్టుకున్న పోలీసులు
గంజాయి విలువ రూ.13.50 లక్షలు