తప్పిపోయిన బాలుడు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు అప్పగింత | - | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన బాలుడు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు అప్పగింత

Published Sat, Apr 5 2025 12:21 AM | Last Updated on Sat, Apr 5 2025 12:21 AM

కాకినాడ సిటీ: ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ వచ్చే ట్రైన్‌ నంబర్‌ 67446 ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ఎం2 కోచ్‌లో 8 ఏళ్ల బాలుడు ఎక్కినట్లు గుర్తించిన టీటీ ఎస్‌ అచ్యుతరావు ఆ బాలుడిని కాకినాడ ఆర్‌పీఎఫ్‌ పోలీస్‌ సిబ్బందికి శుక్రవారం అప్పగించారు. ఈ బాలుడి విషయాన్ని సీ్త్ర, శిశుసంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎన్‌. విజయలక్ష్మికి వివరించగా ఆమె బాలుడి వివరాలను తెలుసుకున్నారు.

బాలుడి పేరు పి.గణేష్‌, తండ్రి రాజు, వయస్సు 8 సంవత్సరాలు బలగం పేట, అమీర్‌పేట, హైదరాబాద్‌ అని చెప్పాడన్నారు. తల్లిదండ్రులు తనను తిట్టడంతో తన తల్లిదండ్రులకు చెప్పకుండా సికింద్రాబాద్‌లో రైలు ఎక్కినట్లు చెప్పాడని సీ్త్ర శిశుసంక్షేమశాఖ అధికారులు వివరించారు. ఈ బాలుడిని జీఆర్‌పీ ఎస్‌ఐ ఎన్‌ రవికుమార్‌ ఆధ్వర్యంలో ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బందికి సంరక్షణ నిమిత్తం అప్పగించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement