సాక్షిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి | - | Sakshi
Sakshi News home page

సాక్షిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

Published Sat, Apr 12 2025 2:38 AM | Last Updated on Sat, Apr 12 2025 2:38 AM

సాక్ష

సాక్షిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సాక్షి దినపత్రిక సంపాదకులు ఆర్‌.ధనంజయరెడ్డితో పాటు పల్నాడు జిల్లాకు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు వి.నవీన్‌రాజ్‌ శుక్రవారం డిమాండ్‌ చేశారు. మాచర్ల మండలంలో జరిగిన పి.హరిశ్చంద్ర అనే వ్యక్తి హత్య కేసు ప్రచురణ వార్త కారణంగా సమాజంలో వైషమ్యాలు పెచ్చరిల్లుతాయనే సాకుతో కేసు బనాయించటం అక్రమమని పేర్కొన్నారు. హంతకులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు.. ఆ పనికి బదులుగా ఇలా అక్రమ కేసులు బనాయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ప్రచురితమైన సమాచారంలో తప్పులుంటే వాటిని సవరించుకునేందుకు వివిధ మార్గాలున్నాయన్నారు. వాటిని కాదని, మీడియాను, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే వైఖరిని పోలీసులు అనుసరించటం సరైనది కాదని స్పష్టం చేశారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని పోలీస్‌ స్టేషన్‌ వ్యవహారాలపై ప్రచురితమైన ఒక వార్తకు సంబంధించి కూడా 8 దినపత్రికలకు పోలీసులు నోటీసులు జారీ చేశారన్నారు. నేరానికి బాధ్యులైన వారిని పట్టుకుని శిక్షించేలా పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో సరైన సమాచారం నిష్పక్షపాతంగా అందించే కచ్చితమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసే చర్యలకు పోలీసులు పాల్పడకుండా చూసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నవీన్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌ సీపీలో పలువురికి పదవులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): వైఎస్సార్‌ సీపీ అనుబంధ విభాగాల్లో జిల్లాకు చెందిన పలువురికి చోటు కల్పించారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పల్లి ఫణీంద్ర, రాష్ట్ర పంచాయతీరాజ్‌ విభాగం కార్యదర్శిగా కొయ్యా మురళీకృష్ణ, రాష్ట్ర మేధావి విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎలిశెట్టి కొండలరావు ( గిరి), రాష్ట్ర క్రిస్టియన్‌ మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శిగా మారేళ్ల స్టీఫెన్‌ ఆనంద్‌ను, సంయుక్త కార్యదర్శిగా నక్కా జాన్‌ ఆనంద్‌ను నియమించారు.

ఆదర్శమూర్తి ఫూలే

కాకినాడ సిటీ: దేశంలోని మహా నాయకులందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావ్‌ ఫూలే అని జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా కాకినాడ జీజీహెచ్‌ సెంటర్‌లోని ఆయన విగ్రహానికి కలెక్టర్‌, ఎంపీ సానా సతీష్‌, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు తదితరులు శుక్రవారం పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఫూలే స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని అన్నారు. వెనుకబడిన వర్గాల విద్య కోసం, మానవ హక్కుల కోసం ఫూలే ఎంతో పోరాడారని వివరించారు. అత్యంత వెనుకబడిన కులాల వారి అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ, కాపు, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా 513 మందికి రూ.11 కోట్ల 86 లక్షల 44 వేల రుణాల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి ఎం.లల్లి తదితరులు పాల్గొన్నారు.

నేడు యథావిధిగా రిజిస్ట్రేషన్లు

కాకినాడ లీగల్‌: రెండో శనివారం సెలవు అయినప్పటికీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు, సబ్‌ రిజిస్ట్రార్లు, ఉద్యోగులు విధులు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు శనివారం పని చేయనున్నాయి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ యథావిధిగా దస్తావేజుల రిజిస్ట్రేషన్లు చేస్తారు. సెలవు రోజున పని చేయాలనే ఆదేశాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పీజీఆర్‌ఎస్‌ రద్దు

కాకినాడ క్రైం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా కాకినాడలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని రద్దు చేశారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.

సాక్షిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి 1
1/1

సాక్షిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement