
బొమ్మను తుడిచేశారు.. గుండెల్లో గుడిని ఏం చేస్తారు?
పిఠాపురం: కొన్నేళ్లుగా జరగనంత అభివృద్ధి ప్రజల ముంగిటకే పాలన, అధికారులంతా గ్రామాల్లోనే ప్రజల ముందే పని చేయడం ఇలా ఒకటేమిటి అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు తెచ్చిన ఏకై క నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఇదే మాట ప్రతీ నోటా వినబడుతోంది. దీన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు జగన్‌ను తలుచుకుని పథకాలు ఇవ్వలేని తమను ఎక్కడ తరిమి కొడతారో అనే భయమో ఏమో ఆయన బొమ్మ లేకుండా చేద్దామనుకుని శిలాఫలకాలపై మాజీ సీఎం పేరుతో ఉన్న బొమ్మలను చెరిపేస్తున్నారు. కానీ ఆయన కట్టించిన భవనాన్ని, పాలనను మాత్రం కావాలంటున్నారు. అదే కార్యాలయంలో ఆయన నియమించిన సిబ్బందితో పనులు చేయించుకుంటూ అది కట్టించిన వారి ఆనవాళ్లు మాత్రం ఉండకూడదనుకుంటున్నారు. దీన్ని చూసిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బొమ్మను తీయగలరు గాని ఆయన చేసిన మంచిని జనం గుండెల్లోంచి తొలగించలేరుగా అంటున్నారు.