
పవన్ అడ్డా.. మురికి గడ్డ
మంగయ్యమ్మరావుపేటలో వర్షం వస్తే రోడ్డు
చెరువవుతుంది
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడ్డాగా చెప్పుకొంటున్న పిఠాపురం మున్సిపాలిటీ ‘మురికిపాలిటీ’గా మారి పోయింది. ఎక్కడ చూసినా పట్టణంలో అపరిశుభ్రత తాండవిస్తోంది. డ్రైన్లు పొంగి పొర్లుతూండటంతో రోడ్లు మురికికూపాలను తలపిస్తున్నాయి. స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన మున్సిపల్ కుళాయిల నుంచి మురుగు నీరే వస్తోంది. మంచి నీరు కావాలంటే మురికి కాలువలోకి దిగి తెచ్చుకోవాల్సి దుస్థితి నెలకొంది. పట్టణంలో పందుల వీరవిహారం గురించి చెప్పనవసరమే లేదు. ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. దీంతో, ‘పవన్ కల్యాణ్ ఇలాకాలో మా దుస్థితి ఇదీ’ అంటూ జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ చల్లా లక్ష్మి స్వయంగా మురికి కాలువలను శుభ్రం చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రజలు తమను తిడుతున్నారని ఆవేదన చేశారు. ఓట్లు వేసి, ఎమ్మెల్యేగా గెలిపించి, ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా చేసిన పవన్ కల్యాణ్ ఒక్కసారైనా వచ్చి చూసి, తమ కష్టాలను గట్టెక్కిస్తారేమోనని పట్టణ ప్రజ లు ఆశ పడుతున్నారు.
– పిఠాపురం
మురికి కాలువలను శుభ్రం చేస్తున్న జనసేన నేత చల్లా లక్ష్మి

పవన్ అడ్డా.. మురికి గడ్డ

పవన్ అడ్డా.. మురికి గడ్డ

పవన్ అడ్డా.. మురికి గడ్డ