
మద్దతు ధర మాటే లేదు
కౌలుకు 5 ఎకరాలు చేశాను. ఎక రాకు రూ.30 వేల పెట్టుబడి పెట్టాను. సాధన రకం వరి వంగడాన్ని పండించాను. 40 బస్తాల దిగుబడి వచ్చిందనే సంతోషం లేకుండా పోయింది. బస్తాకు రూ.1,750 కనీస మద్దతు ధర వస్తుందని ఆశ పడ్డాను. తీరా ఇప్పుడు బస్తా రూ.1,250 చొప్పున అడుగుతున్నారు. అది కూడా నెల రోజుల అరువుకు అడుగుతున్నారు. గత ఏడాది రైతు భరోసా కేంద్రం ద్వారా రూ.1,750కి కొనుగోలు చేశారు. ఇప్పుడు బ స్తాకు రూ.500 చొప్పున ఎకరాకు రూ.20 వేలు నష్టపోతున్నా. పెట్టుబడి, కౌలు కూడా వచ్చే పరిస్థితి లేదు.
– పల్లా రాజు, కౌలు రైతు, లక్ష్మీపురం,
పిఠాపురం మండలం