
రైతులకు నష్టం రాకుండా చూడాలి
రబీ వరి పంట కోతలు ప్రారంభించాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల నష్టపోతున్నాము. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. ఈ ఏడాది దిగుబడులు కూడా తగ్గడంతో అంతగా ఆదాయం వచ్చే అవకాశం లేనందున ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలి.
– గొల్లపల్లి వీరబాబు, రైతు, మల్లేపల్లి, గండేపల్లి మండలం
కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి కోతలు ప్రారంభించారు. ఇంకా పూర్తి స్థాయిలో కోతలు ప్రారంభం అయ్యే లోపు అన్ని మండలాల్లోను కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాము. ప్రస్తుతం గండేపల్లి, ఏలేశ్వరం, కొత్తపల్లి మండలాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో తొలుత కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాము. రైతులకు త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాము.
– ఎన్.విజయకుమార్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, కాకినాడ