వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జోనల్ అధ్యక్షుడిగా ర
అమలాపురం టౌన్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల జోనల్ అధ్యక్షుడిగా అమలాపురం నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకుడు జిల్లెళ్ల రమేష్‌ను పార్టీ కేంద్ర కార్యాలయం నియమించింది. రమేష్ గతంలో పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి విద్యార్థి విభాగంలో పనిచేసిన అనుభవంతో రమేష్‌ను ఉభయ గోదావరి జిల్లాల జోనల్ అధ్యక్షునిగా పార్టీ నియమించింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు
కాకినాడ రూరల్: స్థానిక సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో తాగి వాహనం నడుపుతున్న వారిని గుర్తించి 12 కేసులను పోలీసులు నమోదు చేశారు. వాహన తనిఖీలలో భాగంగా, తాగి వాహనం నడిపిన వాహనదారులకు 3వ జ్యూడిషల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి జి.శ్రీదేవి శిక్ష విధించారు. 12 మందిలో 8 మందికి ఒకొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.80వేల రూపాయల జరిమానా, నలుగురికి ఒకొక్కరికి రెండు రోజులు జైలు శిక్ష విధించారు.


