
మేనేజ్‌మెంట్ ఫెస్ట్‌తో ఉపయోగం
కాకినాడ రూరల్: విద్యార్థి దశలో మేనేజ్‌మెంట్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు వాళ్లలోని నైపుణ్యాలను వెలికి తీయడానికి, సమాజంలో ఎదుర్కోబోయే వివిధ సవాళ్లను నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎంఎస్‌ఎన్ క్యాంపస్, కామర్స్, మేనేజ్‌మెంట్ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో తలాష్–2కె25 పేరుతో జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. ప్రశాంతిశ్రీ అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌గా విభాగాధిపతి డాక్టర్ డి.అజయ్ రతన్ నేతృత్వం వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఓఎన్‌జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రబాల్‌సేల్ గుప్త మాట్లాడుతూ ఇలాంటి అనుభవాలు ఉద్యోగ అవకాశాల్లో ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ తలాష్ అనే ఒక మంచి టైటిల్‌ను దీనికి అందించిన విభాగాన్ని అభినందించారు. మరో విశిష్ట అతిథి ఓఎన్‌జీసీ జనరల్ మేనేజర్ (హెచ్‌ఆర్) కె. సునీల్‌కుమార్ బహుమతులు విద్యార్థులకు అందించారు. వివిధ క్యాంపస్‌లు, కాలేజీల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విభాగాధిపతి డాక్టర్ డి.అజయ్ రతన్ మాట్లాడుతూ, ‘విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బిజినెస్ దృక్పథం, సమస్య పరిష్కరణ నైపుణ్యాలు, బృందపనుల అవగాహన కలిగించేలా ఈ ఫెస్ట్‌ని రూపొందించామన్నారు. డిపార్ట్‌మెంట్ అధ్యాపకులు డాక్టర్ శ్రీరామరాజు, డాక్టర్ మధు కుమార్, మణికంఠేశ్వర్‌రెడ్డి, మనోజ్ దేవ, డాక్టర్ అప్పారావు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమా రజిత పాల్గొన్నారు.
నన్నయ విశ్వవిద్యాలయం వీసీ ప్రసన్నశ్రీ

మేనేజ్‌మెంట్ ఫెస్ట్‌తో ఉపయోగం