
అనుమతుల్లేని క్వారీలో యంత్రాల సీజ్
రౌతులపూడి: మండలంలోని ములగపూడిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీల్లో మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో సర్వే నంబరు–1లో ప్రభుత్వ అనుమతులు పొందకుండా నిర్వహిస్తున్న నల్లరాయిని అధికారులు గుర్తించారు. ఈ క్వారీలో పనిచేస్తున్న ఒక కంప్రెసర్, డ్రిల్లింగ్ మెషీన్, 323 పొక్లెయిన్‌ను సీజ్‌చేసి స్వాధీనం చేసుకున్నట్లు మైనింగ్ ఆర్‌ఐ మురళీకృష్ణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న యంత్రాలను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని చెఆప్పరు. ఆర్‌ఐ పట్నాయక్, వీఆర్‌ఓ శ్రీను, మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు.