భద్రతా లక్ష్యాల సాధనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

భద్రతా లక్ష్యాల సాధనే లక్ష్యం

Apr 12 2025 2:38 AM | Updated on Apr 12 2025 2:38 AM

భద్రత

భద్రతా లక్ష్యాల సాధనే లక్ష్యం

యుద్ధ నౌకపై హెలికాప్టర్‌ విన్యాసాలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): భారత్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా కాకినాడ బీచ్‌లో నిర్వహిస్తున్న ఎక్సర్‌సైజ్‌ టైగర్‌ ట్రయంఫ్‌ శుక్రవారం ఘనంగా ముగిసింది. హెదరాబాద్‌ యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ మాట్లాడుతూ మానవత సహాయ, విపత్తు ప్రతిస్పందన, కాల్పనిక ప్రకృతి వైపరీత్యం తరువాత ఫీల్డ్‌ ఆసుపత్రి ఏర్పాటు, సరఫరా, పంపిణీ ప్రదేశాలను ఏర్పాటు చేయడం వంటి బాధ్యతలను సంయుక్త బలగాలు చేపట్టాయని తైలిపారు. భారత్‌తో కలిసి రెండో సారి ఈ విన్యాసాలు చేయడం గర్వంగా ఉందన్నారు. టైగర్‌ ట్రయంఫ్‌ వంటి వ్యాయామాల ద్వారా యూఎస్‌, భారత్‌ పరస్పర భద్రతా లక్ష్యాలు సాధించడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వారం రోజుల పాటు జరిగిన వ్యాయామం, ఉభయచర ల్యాండింగ్‌ తదితర అంశాలు ముగిసాయని తెలిపారు. విశాఖలో వారంరోజుల పాటు ఆపరేషన్‌ ప్రణాళిక, యూనిట్‌–స్థాయి శిక్షణ, సబ్జెక్ట్‌ నిపుణుల మార్పిడి, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయన్నారు. యూఎస్‌ నేవీకి సంబంధించిన విడ్‌బే ఐలాండ్‌, క్లాస్‌ డాక్‌ ల్యాండింగ్‌ అధికారికంగా జరగాల్సిందన్నారు. ఏప్రియల్‌ 1న జలాశ్వలో ప్రారంభమైన ఈ వేడుకలో 3 వేల మంది సిబ్బంది, నాలుగు నౌకలు, ఏడు విమానాలు పాల్గొన్నాయని తెలిపారు.

ముగిసిన టైగర్‌ ట్రయంఫ్‌–2025

విన్యాసాలు చేయడం గర్వంగా ఉందన్న

యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జెన్నిఫర్‌

భద్రతా లక్ష్యాల సాధనే లక్ష్యం 1
1/3

భద్రతా లక్ష్యాల సాధనే లక్ష్యం

భద్రతా లక్ష్యాల సాధనే లక్ష్యం 2
2/3

భద్రతా లక్ష్యాల సాధనే లక్ష్యం

భద్రతా లక్ష్యాల సాధనే లక్ష్యం 3
3/3

భద్రతా లక్ష్యాల సాధనే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement