ప్రతిభ చూపిన శ్రీప్రకాష్
తుని: ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచినట్లు శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి విజయ్‌ప్రకాష్ శనివారం తెలిపారు. ప్రధమ సంవత్సరం ఎంపీసీలో ఆర్‌ఎస్‌ఎస్ నగేష్ 464/470, జి.అనూష 460/470, కె.యామినిజ్యోతిక 460/470, బైపీసీలో ఆర్ నాగసూర్యభవ్య 429/440 మార్కులు సాందించారన్నారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ నందు ఏ హర్షిత 988/1000, ఎస్.మేఘన 986/1000, బైపీసీలో ఎం.సత్యఅక్షయ 986/1000, సీహెచ్ పూర్ణశివాని 984/1000 మార్కులు సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సీహెచ్‌వీకే నరసింహారావు, ప్రిన్సిపాల్ భానుమూర్తి, అకడమిక్ ఇన్‌చార్జి శ్రీలక్ష్మి తదితరులు అభినందించారు.
ప్రతిభ చూపిన శ్రీప్రకాష్
ప్రతిభ చూపిన శ్రీప్రకాష్
ప్రతిభ చూపిన శ్రీప్రకాష్


