నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం మాది.. పోచారం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్న ప్రభుత్వం మాది.. పోచారం

Published Fri, Oct 6 2023 1:48 AM | Last Updated on Fri, Oct 6 2023 5:47 AM

- - Sakshi

సీఎండీ ప్రభాకర్‌ రావుతో కలిసి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్న స్పీకర్‌

కామారెడ్డి: రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఏకై క ప్రభుత్వం మాదేనని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కొల్లూర్‌లో రూ.98 కోట్ల నిధులతో నిర్మించిన 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, వరంగల్‌ సీఎండీ గోపాల్‌రావు, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు.

నేడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌ రాష్ట్రాన్ని 15 ఏళ్లు సీఎంగా పాలించినా నేటికి అక్కడ కరెంటుకు దిక్కులేదన్నారు. సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ఆలోచించడం, సీఎండీగా ప్రభాకర్‌రావు డిస్ట్రీబ్యూషన్‌, ట్రాన్స్‌మిషన్‌, జనరేషన్‌లో తీసుకున్న విప్లవాత్మక చర్యల మూలంగా తెలంగాణలో విద్యుత్‌ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు.

ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్బవించిన సమయంలో మనకు 7,780 మెగావాట్ల విద్యుత్‌ వస్తే దాన్ని నేడు 20 వేల మెగావాట్లకు తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్‌, సీఎండీ ప్రభాకర్‌రావులకే దక్కుతుందన్నారు. కొల్లూర్‌లో నిర్మించిన సబ్‌స్టేషన్‌తో ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలకు విద్యుత్‌ సరఫరా జరుగుతుందన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్‌కిట్‌లను పంపిణీ చేశారు.

నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ నీరజా వెంకట్రారెడ్డి, జెడ్పీటీసీ పద్మాగోపాల్‌రెడ్డి, సర్పంచ్‌ తుకారాం, నాయకులు ద్రోణవల్లి సతీష్‌, అంజిరెడ్డి, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

తలసరి వినియోగంలో టాప్‌
తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్ర తలసరి విద్యుత్‌ వినియోగం 2,140యూనిట్లు అయితే దేశం సరాసరి విద్యుత్‌ తలసరి వినియోగం 1255 యూనిట్లు మాత్రమేనని తెలిపారు. వరంగల్‌ సీఎండీ గోపాల్‌రావు, ఎస్‌ఈ సూర్య నర్సింహారావు, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement