
జార్జిరెడ్డి ఆశయ సాధన కోసం ఉద్యమించాలి
కరీంనగర్: జార్జిరెడ్డి ఆశయసాధన కోసం విద్యార్థులు ఉద్యమించాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటమే జార్జిరెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణాప్రతాప్ అన్నారు. పీడీఎస్‌యూ సంస్థాపకుడు, ఉస్మానియా యూనివర్సిటీ అరుణతార జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా సోమవారం నగరంలోని బీసీ బాయ్స్ హాస్టల్‌లో జార్జిరెడ్డి చిత్రటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో పేద విద్యార్థుల గొంతుకగా విద్యార్థుల తరఫున పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కెంసారపు రవితేజ, నాయకులు కొయ్యడ బాబు, ఎండీ అస్లాం, రమేశ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.