
నేడు కర్నూలుకు మాజీ సీఎం వైఎస్ జగన్
కర్నూలు(టౌన్): మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కర్నూలుకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30 గంటలకు కర్నూలులోని జొహరాపురం రోడ్డులో ఉన్న మైపర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నగర శివారులోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో కుడా మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నాయకులు కోట్ల హర్షవర్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో మాజీ సీఎం పాల్గొంటారు.
వధూవరులను ఆశీర్వదించి వైఎస్సార్ సీపీ నాయకులతో మాట్లాడిన అనంతరం ఆయన తిరిగి 12.50 గంటలకు తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు. మాజీ సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ పనులను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, పార్టీ కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలపు సతీష్‌లు పరిశీలించారు. ఏర్పాట్లపై కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్‌తో చర్చించారు.