
లబ్ధిపొందాను.. నడిచే వెళ్తాను
నెక్కొండ: మాజీ సీఎం కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఓ వృద్ధుడు చేపట్టిన పాదయాత్ర శనివారం వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రానికి చేరింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామం చంద్రుతండాకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు భూక్య గంగ్యానాయక్ చేతితో కేసీఆర్ ఫ్లెక్సీ పట్టుకుని పాదయాత్ర చేపట్టాడు. భగభగ మండుతున్న ఎండను లెక్క చేయకుండా అభిమానంతో పాదయాత్రగా సభాస్థలికి వెళ్తున్నాడు. ఈసందర్భంగా గంగ్యానాయక్ మాట్లాడుతూ.. తన కుటుంబానికి రైతు బంధు, తన కుమారుడు మృతి చెందితే రైతు బీమా రూ.5 లక్షలు వచ్చాయన్నాడు. కేసీఆర్ ప్రభుత్వంలో తన కుటుంబానికి లబ్ధి చేకూరిందని.. అందువల్ల పాదయాత్రగా సభకు వెళ్తున్నట్లు చెప్పాడు. స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు కొమ్ము రమేశ్‌యాదవ్, మారం రాము, సంగని సూరయ్య, కారింగుల సురేశ్, కొమ్మారెడ్డి రవీందర్‌రెడ్డి, మహ్మద్ ఖలీల్, ఈదునూరి వెంకన్న తదితరులు గంగ్యానాయక్‌ను సన్మానించారు.
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు
పాదయాత్రగా వెళ్తున్న వృద్ధుడు
75 ఏళ్ల వయస్సులో తన అభిమానాన్ని చాటుతున్న గంగ్యానాయక్