
మెడికల్ కళాశాలకు భౌతికకాయం అందజేత
నెహ్రూసెంటర్: సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు మండల వెంకన్న సతీమణి అరుణశ్రీ మృతి చెందగా ఆమె మృతదేహాన్ని మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఆదివారం అందజేశారు. మెడికల్ విద్యార్థుల పరిశోధన కోసం అనాటమి డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భరత్‌కు భౌతికకాయం అప్పగించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, పిల్లి సుధాకర్, వడ్డెబోయిన శ్రీనివాస్, మైస శ్రీనివాస్, సాదుల శ్రీనివాస్, అవయవదాతల సంఘం రాష్ట్ర కార్యదర్శి పరికిపండ్ల అశోక్, జిల్లా కన్వీనర్ పర్కాల రవీందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.