పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మహబూబాబాద్ అర్బ న్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాల ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆదివారం లయన్స్ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ అ ధ్యక్షతన సంఘం జిల్లా ఉద్యమ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా చావ రవి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుంచి ఇ–కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న జీపీఎఫ్ రుణాలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్, పెన్షన్ బకాయిలు అన్ని రకాల పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయలన్నారు. ఐదు డీఏలను ప్రకటించాలని, పీఆర్సీ నివేదికను తెప్పించుకొని 30శాతం ఫిట్‌మెంట్ తగ్గకుండా అమలు చేయాలన్నారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్స్ చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు 010పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల టీచర్లకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, కేజీబీవీలకు మినిమం టైం స్కేల్ చెల్లించాలని, అన్ని రకాల సెలవులు వర్తింపజేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాకూబ్, ఉపాధ్యక్షులు స్వప్న, వెంకటేశ్వర్లు, కోశాధికారి నాగమల్లయ్య, కార్యదర్శులు రమేశ్, భద్రునాయక్, వివేక్, మంజుల, హుస్సేన్, నర్సింహారావు, హరినాయక్, మండలాల బాధ్యులు కుమార్, రాజశేఖర్, ప్రవీణ్, చైతన్య, శైలజ, రమ్య, జయ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


