
‘పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’
బెల్లంపల్లి: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం పట్టణంలోని బజారు ఏరియా, బుధాకలాన్‌లో కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సన్న బియ్యం అందించడం వల్ల పేదలు కడుపునిండా భోజనం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. కలెక్టర్ కు మార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో సరిపడా స న్నబియ్యం నిల్వలు ఎల్‌ఎంఎస్ పాయింట్లలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బుధాకలాన్‌లో స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఆర్డీవో పి.హరికృష్ణ, తహసీల్దార్ యు.జ్యోత్స్న, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జే.శ్వేత, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి, మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ, ముచ్చర్ల మల్ల య్య తదితరులు పాల్గొన్నారు.