
సహకార సంఘాలను బలోపేతం చేయాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నా రు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి జిల్లా అధికారులు, నూతనంగా ఏర్పాటైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈవో గణపతి, జిల్లా సహకార అధికారి మోహన్, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి శంకర్ పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణి దరఖా స్తుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి జిల్లా అధికారులతో ప్రజ వాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.