
సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య
మంచిర్యాలఅగ్రికల్చర్: నిజాం నిరంకుళ పాలనలో ప్రజల సంక్షేమం, భూమి, భుక్తి, విముక్తి కోసం తెలంగాణ సాయుధ ఉద్యమంలో దొడ్డి కొమురయ్య అలుపెరుగని పోరాటం చేశారని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధ్వర్యంలో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, కుల సంఘాల నాయకుల ప్రతినిధులతో కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.