గీత కార్మికుల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

గీత కార్మికుల సంక్షేమానికి కృషి

Apr 11 2025 1:13 AM | Updated on Apr 11 2025 1:13 AM

గీత కార్మికుల సంక్షేమానికి కృషి

గీత కార్మికుల సంక్షేమానికి కృషి

చెన్నూర్‌: గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. గురువారం స్థా నిక ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో 70మంది గీత కార్మికులకు కాటమయ్య కిట్లను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లు గీ త కార్మికులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్‌ అధి కారులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమమే ధ్యేయం

చెన్నూర్‌రూరల్‌/జైపూర్‌: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ అ న్నారు. కాంగ్రెస్‌ పార్టీ జై బాపు, జై భీం, జై సంవిధాన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం చెన్నూర్‌ మండలం ఒత్కులపల్లి, జైపూర్‌ మండలం కుందారం గ్రామాల్లో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. కుందారంలో రూ.20లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ మూల రాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్‌రావు, జైపూర్‌ ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ విద్యాసాగర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement