
సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలి
దండేపల్లి: సాధారణ ప్రసవాలపై ప్రజలకు అవగాహన కల్పించి, శస్త్రచికిత్సలు తగ్గించాలని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్ సూచించారు. మండలంలోని తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యక్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి అప్పాల ప్రసాద్, పీహెచ్‌సీ డాక్టర్ క్రాంతికుమార్ జిల్లా మాస్‌మీడియా అధికారి వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.