
ఒప్పందాలతోనే సరి.. అమలు ఏది మరి?
● స్ట్రక్చరల్ ఒప్పందాలకు కలగని మోక్షం ● ఉత్తర్వుల జారీలో సింగరేణి జాప్యం ● నష్టపోతున్న కార్మికులు ● గుర్తింపు సంఘం ఒత్తిడికి డిమాండ్
శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్ట్రక్చరల్ సమావేశాలు చాలా కాలం తర్వాత ఫలప్రదమయ్యాయి. అనేక డిమాండ్లపై యాజమాన్యానికి, గుర్తింపు కార్మిక సంఘానికి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాల అమలులో జాప్యం కార్మికులను నిరాశకు గురి చేస్తోంది. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు యజమాన్యంతో జరిపిన చర్చల్లో ఆమోదించిన డిమాండ్లు ఇప్పటికీ కాగితంపైనే ఉన్నాయి.
సమావేశాల పునరుద్ధరణ
ఐదేళ్లుగా నిలిచిన స్ట్రక్చరల్ సమావేశాలు, 2024లో ఏఐటీయూసీ గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన తర్వాత పునఃప్రారంభమయ్యాయి. నవంబర్ 24న డైరెక్టర్ (పర్సనల్ అడ్మినిస్ట్రేషన్), మార్చి 6, 2025న సీఎండీ స్థాయిలో సమావేశాలు జరిగాయి. ఏఐటీయూసీ నాయకులు మెడికల్ అన్‌ఫిట్ కార్మికులకు సర్ఫేస్ ఉద్యోగాలు, స్వంత ఇళ్ల కార్మికులకు క్వార్టర్ వెకేషన్ సర్టిఫికెట్, డిస్మిస్ కార్మికులకు ఉద్యోగ పునరుద్ధరణ వంటి డిమాండ్లను ప్రస్తావించారు.
కమిటీల జాప్యం
సొంత ఇంటి పథకం, పెర్క్స్‌పై పన్ను మినహాయింపు, విజిలెన్స్ కేసుల పరిష్కారం వంటి డిమాండ్లపై కమిటీలు ఏర్పాటు చేయాలని యజమాన్యం నిర్ణయించింది. అయితే, కమిటీల ప్రక్రియలో జాప్యం నివారించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యజమాన్యం వెంటనే ఉత్తర్వులు జారీ చేసి, కమిటీల నివేదికలను త్వరితగతిన సమర్పించాలని కార్మికులు కోరుతున్నారు. స్ట్రక్చరల్ సమావేశాలు కార్మిక సంక్షేమానికి ఆశాకిరణంగా నిలిచినప్పటికీ, ఒప్పందాల అమలులో జాప్యం కార్మికుల నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. యాజమాన్యం ఒప్పందాల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తర్వుల కోసం యాజమాన్యంపై ఒత్తిడి..
కంపెనీ స్థాయిలో డైరెక్టర్ (పా), సీఎండీ లెవల్ స్ట్రక్చరల్ సమావేశంలో జరిగిన ఒప్పందాలపై యజమాన్యం వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలి. జాప్యం సరికాదు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం చాలా కాలంగా కార్మికవర్గం ఎదురుచూస్తుంది. ఉత్తర్వుల కోసం యజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నాం. – కొరిమి రాజ్‌కుమార్,
ఏఐటీయూసీ కేంద్ర ప్రధాన కార్యదర్శి
ఒప్పందాలలో జాప్యం
యజమాన్యం కొన్ని డిమాండ్లకు బేషరతుగా ఒప్పుకుంది. మరికొన్నింటిపై కమిటీలు ఏర్పా టు చేస్తామని చెప్పింది. ప్రమోషన్లలో సర్వీసు నిబంధనల మార్పు, శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజె క్టు కోడ్‌ల విభజన, హైదరాబాద్‌లో సూపర్ స్పె షాలిటీ ఆసుపత్రి ఏర్పాటు, క్యాంటీన్ల స్వయం నిర్వహణ వంటి ఒ ప్పందాలు కుదిరాయి. మైనింగ్ స్టాఫ్, ఈఅండ్‌ఎం సూపర్‌వైజర్లు అండర్ గ్రౌండ్‌లో మెడికల్ అన్‌ఫిట్ అయితే వారికి సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ డిమాండ్ పరిష్కా రం కోసం వీరంతా ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నారు. జేఎంవో, జేటీవో, జేఏవోలకు ప్రమోషన్‌కు సంబంధించిన అంశంలో ఏ1 గ్రేడ్‌లో 5 సంవత్సరాల సర్వీసు చేసి ఉంటేనే వారికి ఎగ్జిక్యూటీవ్ గా పదోన్నతి కల్పిస్తుండగా దాన్ని మార్చుతూ ఏ గ్రేడ్‌లోనే 5 సంవత్సరాలు సర్వీసు ఉన్న కూడా ప్రమోషన్ ఇవ్వడానికి ఒప్పందమైంది. కాని దీనికి కూడా ఉత్తర్వులు రాలేదు. డిస్మిస్ కార్మికులందరికీ 5 ఏళ్ల కాలంలో కనీసం ఒక సంవత్సరం 100 మస్టర్లు ఉంటే తిరిగి ఉద్యోగం కల్పించడానికి యజమాన్యం ఒప్పుకుంది. ఈ ఒప్పందాలపై ఉత్తర్వులు వెలువడతాయని ఆశించిన కార్మికులకు నిరాశే మిగిలింది.

ఒప్పందాలతోనే సరి.. అమలు ఏది మరి?