
జిల్లా రిసోర్స్‌పర్సన్లకు ఇంటర్వ్యూలు
మంచిర్యాలఅర్బన్: సర్కారు బడుల్లో మెరుగైన విద్య అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వేసవి సెలవుల్లో వివిధ సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. తెలుగు, ఇంగ్లిషు, ఉర్ధూ మాధ్యమాల్లో బోధనకు జిల్లా రిసోర్స్‌పర్సన్ల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. సోమవారం మంచిర్యాల డీసీఈబీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాలకు రిసోర్స్‌పర్సన్లుగా సేవలు అందించడానికి దరఖాస్తు చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ కేడర్లకు చెందిన 60 మంది ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. వివిధ రకాల ప్రశ్నలకు మెరుగైన స్కోర్ సాధించిన వారిని ఎంపిక చేయనున్నారు. ఆదిలాబాద్ డైట్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ కిరణ్‌కుమార్, సమగ్రశిక్ష శిక్ష కో–ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి, ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్, లెక్చరర్లు శంకర్, కిషోర్‌కుమార్, సురేష్, డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్‌రెడ్డి, చౌదరి పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 44 మంది ఉపాధ్యాయులను జిల్లా రిసోర్సుపర్సన్లుగా ఎంపిక చేయనున్నారు.