
బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
పాతమంచిర్యాల: బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ పంపించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలం గడిచినా బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నా రు. ఎన్నికల హామీలను అమలు చేసి బీసీల ఆకాంక్షను నెరవేర్చాలని అన్నారు. నాయకులు గజెల్లి వెంకటయ్య, శాఖపురి భీంసేన్, అంకం సతీష్, భిక్షపతి, సల్మాన్, మహిళా నాయకురాలు లలితముదిరాజ్, రవికిరణ్, రాజం పాల్గొన్నారు.