
‘ఉపాధి’లో రిక‘వర్రీ’
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వంద రోజుల పని కల్పించి ఆర్థిక స్థితి మెరుగుపర్చేందుకు అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో రూ.లక్షలు పక్కదారి పడుతున్నాయి. ఏటా సామాజిక తనిఖీల్లో భారీగా ఆర్థిక తేడాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో అధికారులు, సిబ్బంది గ్రామాల్లో సామాజిక తనిఖీ ప్రజావేదిక సభలు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా గుర్తిస్తున్నారు. అయినా అక్రమాలు ఆగడం లే దు. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో మొత్తం రూ.5లక్షలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. జిల్లాలో ఈ పథకం అమలవుతున్న 16మండలాల్లో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సామాజిక ఆర్థిక తనిఖీలు మొదలు కానుంది. సోమవారం మందమర్రి మండలంలో ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ఆ ఏడాదిలో జరిగిన ఉపాధి హామీ పథ కం నిధుల ఖర్చు, అందులో తేడాలు గుర్తించి సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల ముందే వివరిస్తారు. కూలీల హాజరు పని దినాల నుంచి మెటీరియల్ పనులు, ఇతర నిధుల ఖర్చు పారదర్శకంగా జరిగిందా..? లేదా అని గుర్తిస్తారు. ఇక ఆన్‌లైన్‌తోపాటు మాన్యువల్ రికార్డులు పరిశీస్తున్నారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి పై స్థాయి వరకు ఎవరు బాధ్యులైతే వారిపై చర్యలు తీసుకుంటారు.
వసూలు అంతంతే..
తనిఖీల్లో గుర్తించిన నిధులపై మళ్లీ రికవరీ మాత్రం అంతంతగానే ఉంటోంది. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లా నుంచి జిల్లా ఏర్పడిన వరకు అత్యధికంగా కొన్ని మండలాల్లో 15 వ రౌండ్ వరకు సభలు పూర్తి కాగా, రూ.లక్షల్లోనే నిధుల అవకతవకలు బయటపడ్డా యి. ఇప్పటికీ ఆయా నిధుల రికవరీ పూర్తి కావడం లేదు. గతేడాది పరిశీలిస్తే ఒక్క మందమర్రి మండలంలో రూ.47వేలకుపైగా తేడాలు గుర్తిస్తే, అందులో రూ.4,539 వసూలు అయ్యాయి. మిగతా ఏ మండలంలోనూ పైసా వసూలు కాలేదు. ఈ ఏడాది లోనూ డబ్బులు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఏప్రిల్ నుంచే మొదలు పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాదికి సంబంధించి మొత్తం రూ.5లక్షలకు పైగా గు ర్తించగా, ఇందులో ఇంకా రూ.4లక్షలకు పైగా మిగిలి ఉన్నాయి. ఇక అంతకుముందు తనిఖీల్లో గుర్తించిన మొత్తం రూ.లక్షల్లో నే ఉంది. ఏటేటా సామాజిక సర్వేలో అవకతవకలు గుర్తిస్తున్నప్పటికీ ఆ మేరకు రికవరీ జరగడం లేదు.
2024–25లో గుర్తించినవి విలువ (రూ.ల్లో)
మండలం రౌండ్ గుర్తించింది మిగిలింది
భీమిని 13 90046 90046
మందమర్రి 14 47387 42848
హాజీపూర్ 03 10428 10428
భీమారం 03 15701 15701
కన్నెపల్లి 03 20364 20364
జన్నారం 14 97278 97278
కాసిపేట 14 18166 18166
వేమనపల్లి 14 975 975
జైపూర్ 14 41632 41632
చెన్నూరు 14 51131 51131
దండేపల్లి 14 6507 6507
కోటపల్లి 15 26166 26166
లక్సెట్టిపేట 14 44088 44088
నెన్నెల 14 3872 3872
తాండూరు 15 13084 13084
బెల్లంపల్లి 15 14237 14237
మొత్తం 5,00,382 4,95,843
నోట్:మందమర్రి మండలంలో
రూ.4,539 రికవరీ అయ్యాయి.
పనుల్లో ఏటా రూ.లక్షల్లో అవకతవకలు
కింది స్థాయి సిబ్బంది పాత్రే అధికం