
ప్రశాంతంగా మోడల్‌స్కూల్ ప్రవేశ పరీక్ష
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ మోడల్ స్కూ ళ్లలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొ త్తం 1,686 మంది విద్యార్థులకు 1,365 మంది హాజరయ్యారు. 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతులలో మిగులు సీట్లకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వర కు పరీక్షలు జరిగాయి. 6వ తరగతి పరీక్ష కో సం 8 పరీక్ష కేంద్రాల్లో 1,021 మంది విద్యార్థులకు 815 మంది హాజరయ్యారు. ఏడో తరగతిలో 299 మందికి 265 మంది, ఎనిమిదో తరగతిలో 212 మంది విద్యార్థులకు 172 మంది, 9వ తరగతికి 126 మంది 99 మంది, పదో తరగతిలో ప్రవేశ పరీక్షకు 28 మందికి 14 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈవో యాదయ్య వివరించారు.