
క్షయవ్యాధి నిర్మూలనకు కృషి
జైపూర్: జాతీయ క్షయవ్యాధి నిర్మూలనలో భాగంగా ఓల్డ్‌ఏజ్ హోమ్స్, భవన కార్మికులు, టీబీ వ్యాధిగ్రస్తులకు ఇంటిలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ద్వారా వైద్యం అందిస్తామని జిల్లా వైద్యాధికారి హరీశ్‌రాజు తెలిపారు. జైపూర్ ఆస్పత్రి వద్ద అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. జిల్లాలో 998 మంది టీబీ వ్యాధిగ్రస్తులు వైద్యం పొందుతున్నారని తెలిపారు. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో అంబులెన్స్ ద్వారా వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. వైద్యులు సుధాకర్‌నాయక్, ప్రసాద్, ముస్తఫా, జిల్లా అక్షయ ప్రోగ్రాం అధికారి సురేందర్, మాస్‌మీడియా అధికారి వెంకటేశ్వర్, వైద్యసిబ్బంది వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.