
ఆలయాల అభివృద్ధికి కృషి
దండేపల్లి: ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. మండలంలోని నంబాల గ్రామంలో సీతారామాంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు ఐక్యతగా చందాలు పోగు చేయడం, దానికి తోడు దేవాదాయ శాఖ నిధులు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. నంబాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తామని, ఆలయ అభివృద్ధి కూడా కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.