
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక, అనూష, రాధ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది. 25 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో శివాజీ పాల్గొంటున్నారు.
‘‘అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతుందనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘దండోరా’ తీస్తున్నాం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే, హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది.