Dhandoraa Movie
-
తెలంగాణ దండోరా
శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక, అనూష, రాధ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ మొదలైంది. 25 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో శివాజీ పాల్గొంటున్నారు. ‘‘అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతుందనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ‘దండోరా’ తీస్తున్నాం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే, హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’
శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా.. బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’ సినిమాను రూపొందించనున్నారు. మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.