
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూశారుగా. అందులో భాగ్యంగా తనదైన యాక్టింగ్ చేసిన ఐశ్వర్య రాజేశ్.. గత కొన్నాళ్లుగా తెలుగులో మూవీస్ చేస్తోంది. అయితే ఈమె నటించిన ఓ తమిళ చిత్రాన్ని ఇప్పుడు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్)
1980ల్లో పలు తెలుగు సినిమాలు చేసిన రాజేశ్ అనే నటుడి కూతురే ఐశ్వర్య రాజేశ్. స్వతహాగా తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ నటిగా కెరీర్ ప్రారంభించింది. 2010 నుంచి అక్కడ వరస చిత్రాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. మలయాళం, హిందీలోనూ ఒకటి రెండు మూవీస్ చేసింది.
కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి వచ్చిన ఈమె.. తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్ తదితర చిత్రాలు చేసింది. అసలు విషయానికొస్తే ఈమె హీరోయిన్ గా చేసిన తమిళ మూవీ ఆరతు సీనం 2016లో రిలీజైంది. దీని తెలుగు వెర్షన్ ని ఇప్పుడు ఆహా ఓటీటీలో నేరుగా రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ సినిమా)
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఐశ్వర్య రాజేశ్ సినిమాని గరుడ 2.0 పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. దీన్ని థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ కథతో తీశారు. అరివళగన్ అనే దర్శకుడు దీన్ని తెరకెక్కించారు. అరుణ్ నిధి, ఐశ్వర్య దత్త, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
గరుడ 2.0 విషయానికొస్తే.. హీరో సీన్సియర్ పోలీస్ ఆఫీసర్. భార్య కూతురితో సంతోషంగా ఉంటాడు. కానీ కొందరు క్రిమినల్స్.. హీరో భార్య కూతురిని చంపేస్తారు. దీంతో మందుకి బానిస అవుతాడు. పై అధికారి చెప్పడంతో చాన్నాళ్ల తర్వాత మళ్లీ డ్యూటీలోకి వస్తాడు. అలా వరస హత్యల కేసు ఇతడికి అప్పగిస్తారు. మరి హీరో.. హంతకుడిని పట్టుకున్నాడా లేదా అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఈవారం ఓటీటీలో 20 చిత్రాలు)