
Bigg Boss Telugu 5, Vishwa Reveals BB5 Winner Name: బిగ్‌బాస్ రియాలిటీ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరున్న విశ్వ గతవారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ తాను హౌస్ నుంచి బయటకు రావడం నమ్మలేకపోతున్నానని, అయితే ప్రేక్షకుల ఓటింగ్‌ను స్వాగతిస్తున్నా అని పేర్కొన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విశ్వ..బిగ్‌బాస్ షో గురించి పలు ఆసక్తిక విషయాలు పంచుకున్నాడు.ఈ షో ద్వారా లోబో తనకు బెస్ట్‌ఫ్రెండ్‌గా మారిపోయాడని, బిగ్‌బాస్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ అదేనన్నాడు.
ఇక అందరూ అనుకుంటున్నట్లుబిగ్‌బాస్ స్క్రిప్టెడ్ కాదని, అందులో జరిగేవన్నీ వాస్తవాలే అని తెలిపాడు. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే తప్పకుండా వెళ్తానని చెప్పాడు. ఇక బిగ్‌బాస్ ఈ సీజన్ విజేత శ్రీరామచంద్ర అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నాని, మంచి స్క్రిప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపాడు.