విజయ్‌ దేవరకొండకు స్టేజీపైనే ముద్దుపెట్టిన హీరో | Kabir Singh Shahid Kapoor, Vijay Devarakonda Bromance Wins Hearts | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: నువ్వు లేకపోతే నేను లేనంటూ రౌడీ హీరోను ముద్దాడిన బాలీవుడ్‌ స్టార్‌, వీడియో వైరల్‌

Published Wed, Mar 20 2024 11:04 AM | Last Updated on Wed, Mar 20 2024 12:58 PM

Kabir Singh Shahid Kapoor, Vijay Devarakonda Bromance Wins Hearts - Sakshi

విజయ్‌ను చూసి ఎమోషనలైన షాహిద్‌ అతడి చేయిని పట్టుకుని విడవలేదు. నేను విజయ్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి. ఎందుకంటే అతడు లేకపోతే అర్జున్‌ రెడ్డి లేదు. అర్జున్‌ రెడ్డి లేకపోతే కబీ

అర్జున్‌ రెడ్డి సినిమాతో విజయ్‌ దేవరకొండ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాతోనే అతడు రౌడీ స్టార్‌గా మారిపోయాడు. ఇది బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌గా రీమేకై అక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. తెలుగులో విజయ్‌ దేవరకొండ పోషించిన పాత్రను హిందీలో షాహిద్‌ కపూర్‌ నటించాడు. తాజాగా ఈ ఇద్దరు అర్జున్‌ రెడ్డిలు ఒక్కచోట కనిపించారు. 

ఓటీటీ ఈవెంట్‌లో అర్జున్‌రెడ్డి, కబీర్‌ సింగ్‌
మార్చి 19న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.. ముంబైలో ఓ ఈవెంట్‌ నిర్వహించింది. ప్రైమ్‌ వీడియోలో రాబోయే సినిమాలు, సిరీస్‌లివే అంటూ పెద్ద జాబితానే రిలీజ్‌ చేసింది. విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌ మూవీ కూడా థియేటర్‌లో రిలీజైన తర్వాత అమెజాన్‌ ప్రైమ్‌లోకి రానుందని షాహిద్‌ కపూర్‌ ప్రకటించాడు. ఈ సమయంలో చిత్రయూనిట్‌ను వేదికపైకి ఆహ్వానించాడు.

విజయ్‌ను చూసి ఎమోషనల్‌
విజయ్‌ను చూసి ఎమోషనలైన షాహిద్‌ అతడి చేయి పట్టుకుని మాట్లాడాడు. 'నేను విజయ్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి. ఎందుకంటే అతడు లేకపోతే అర్జున్‌ రెడ్డి లేదు. అర్జున్‌ రెడ్డి లేకపోతే ఈ కబీర్‌ సింగ్‌ కూడా ఉండేవాడు కాదు' అంటూ అతడి చెంపపై ముద్దుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే షాహిద్‌ కపూర్‌ అశ్వథ్థామ మూవీ కూడా ప్రైమ్‌లోనే రిలీజ్‌ కానున్నట్లు ఈ వేదికపై ప్రకటించారు.

చదవండి: అమెజాన్‌ ప్రైమ్‌ క్రేజీ అప్‌డేట్స్‌: ఒకేసారి 50కి పైగా వెబ్‌సిరీస్‌, సినిమాల ప్రకటన.. లిస్ట్‌ ఇదిగో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement