
బీజీఎం కింగ్ ఎస్ఎస్ తమన్ నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న ట్రోల్స్‌కు గట్టిగానే స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. నెగెటివ్ కామెంట్స్ చేసే వారికి తనదైన స్టెల్లో సమాధానమిచ్చారు. తనను కామెంట్ చేసే వాళ్లందరూ చిన్నపిల్లలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో ఎప్పుడు సరదాగా, కూల్‌గా ఉండే తమన్ ఆగ్రహానికి కారణం ఏంటా అని పలువురు ఆరా తీస్తున్నారు. గిటారు వాయిస్తున్న ఓ వీడియోను షేర్ చేస్తూ.. ‘‘ప్రియమైన నెగెటివిటీ.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీలాంటి చిన్నపిల్లలందరి కోసం ఈ వీడియో అంకితం' అంటూ పోస్ట్ చేశారు తమన్.
కారణం అదేనా?
సంగీత దర్శకుడు తమని ఇటీవలే ‘వీర సింహారెడ్డి’ సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకున్నారు. అంతకుముందు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, బాలకృష్ణ అఖండ చిత్రాలు సూపర్‌హిట్ కావడంలో తమన్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఫేమస్ అయింది. తమన్ ప్రస్తుతం ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తమన్ మ్యూజిక్ బాగలేదని.. ఏమాత్రం వినాలనిపించలేదని పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఇదే తమన్ ఆగ్రహానికి కారణమైంది.
Rest In Peace Dear #Negativity !! To all the kids out there 🤣 pic.twitter.com/pjt7ThMCkn
— thaman S (@MusicThaman) February 4, 2023