నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. బ్రీత్‌ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ | Nandamuri Chaitanya Krishna First Movie Titled as Breathe, Poster Out | Sakshi
Sakshi News home page

Nandamuri Chaitanya Krishna: బ్రీత్‌ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తోన్న ఎన్టీఆర్‌ మనవడు

Published Sun, Mar 5 2023 4:13 PM | Last Updated on Sun, Mar 5 2023 4:13 PM

Nandamuri Chaitanya Krishna First Movie Titled as Breathe, Poster Out - Sakshi

నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న సినిమా

నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కానున్నాడు. నందమూరి తారకరామారావు పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను కళ్యాణ్‌రామ్‌ రిలీజ్‌ చేశాడు.

బ్రీత్‌: అంతిమ పోరాటం అని టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. టైటిల్‌ పోస్టర్‌లో చైతన్య వర్షంలో గొడుగు పట్టుకుని నిలబడి ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నాడు. బసవతారకం క్రియేషన్స్‌ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement