'పుష్ప2' నుంచి మరో సాంగ్‌ ప్రోమో.. అంతా మలయాళంలోనే | Peelings Song Out From 'Pushpa 2: The Rule' Movie | Sakshi
Sakshi News home page

'పుష్ప2' నుంచి మరో సాంగ్‌ ప్రోమో.. అంతా మలయాళంలోనే

Published Fri, Nov 29 2024 2:41 PM | Last Updated on Fri, Nov 29 2024 2:57 PM

Peelings Song Out From 'Pushpa 2: The Rule' Movie

అల్లు అర్జున్‌- సుకుమార్‌ హిట్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'పుష్ప2'. పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌, సాంగ్స్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా పీలింగ్స్ అనే పాట ప్రోమోను మూవీ టీమ్‌ విడుదల చేసింది. ఫుల్‌ సాంగ్‌ను డిసెంబర్‌ 1న రిలీజ్‌ చేస్తామని కూడా ప్రకటన చేసింది. అయితే, అన్ని భాషల్లో రానున్న ఈ సాంగ్‌లో వచ్చే పల్లవి లిరిక్స్‌ మలయాళంలోనే ఉండనున్నాయి. ఈ సాంగ్‌లో కూడా దేవీశ్రీ ప్రసాద్‌ తనదైన మార్క్‌ను చూపించారని చెప్పవచ్చు. 

'పుష్ప2: ది రూల్‌' ఇప్పటికే సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సుమారు 5 కట్స్‌ చెప్పి యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్‌ బోర్డ్‌ ఇచ్చింది. సినిమా రన్‌ టైమ్‌  3 గంటలా 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఉండనుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. డిసెంబర్‌ 5న పుష్ప2 విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement