
తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) ఒకప్పుడు సినిమాలోనూ యాక్ట్ చేశాడు. సిద్దార్థ్‌తో కలిసి బాయ్స్ మూవీ (Boys Movie)లో నటించాడు. అయితే తనకు, సిద్దూకు అస్సలు పడేది కాదంటున్నాడు తమన్. అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్ధం సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 28న విడుదల కానుంది.
బాయ్స్ సినిమాలో నా రచ్చ అంతా ఇంతా కాదు!
ఈ సినిమా ప్రమోషన్స్‌లో తమన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. బాయ్స్ సినిమాలో ఎక్కువ పారితోషికం అందుకుంది నేనే! సిద్దార్థ్(Siddharth)కు, నాకు అస్సలు పడేది కాదు. వాడు నేనే హీరో అంటే.. నువ్వు హీరో అయితే ఏంటి? హీరోయిన్ అయితే నాకేంటి? ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటోంది నేను.. అనేవాడిని. చాలా టార్చర్ పెట్టేవాడిని. సినిమా షూటింగ్‌లో ఓసారి సిద్దార్థ్‌కు నైకీ సాక్స్ ఇచ్చి నాకు ఏదో మామూలు సాక్స్ ఇచ్చారు. నేనది తీసుకెళ్లి రత్నంగారి ముందు పడేశాను. సిద్దార్థ్‌కు నైకీ ఇచ్చి, నాకు నైలాన్ సాక్స్ ఇస్తే ఎలా? అని అడిగాను. ఇలాంటి చీప్ కొట్లాటలు చాలానే ఉన్నాయి. నాకది క్రేజీ ఎక్స్‌పీరియన్స్.
చాలా పెంట చేశా..
బాయ్స్ సినిమాకు అరివళగన్.. శంకర్ దగ్గర అసోసియేటివ్‌గా పని చేశాడు. నన్ను చూసుకోవడమే ఆయన పనైపోయింది. బాయ్స్ సెట్‌లో ఎవరి మాటా వినకుండా అందరినీ టార్చర్ పెట్టేవాడిని. క్యారవాన్‌లో ప్లగ్ తీసేసి కరెంట్ ఆపేవాడిని. బాత్రూమ్‌కు వెళ్లే నీళ్ల పైప్ కూడా కట్ చేసేవాడిని. ఇలా చాలా పెంటలు చేశాను. ఇవన్నీ అరివళగన్ కంట్రోల్ చేసేవాడు. సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో పడ్డాడు అని తమన్ నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చాడు.
చదవండి: నాది రంగుల జీవితం కాదు.. ఎన్నో అవమానాలు..: హీరోయిన్