
'ధమాకా' డైరెక్టర్ నక్కిన త్రినాథరావు (Trinadha Rao Nakkina) నిర్మించిన తాజా చిత్రం చౌర్య పాఠం (Chaurya Paatam Movie). ఇంద్రరామ్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటించిన ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించాడు. కొత్తవాళ్లతో త్రినాథరావు ఈ మూవీ ప్రయోగం చేస్తున్నాడు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు. షూటింగ్స్ కోసం ఆంధ్రప్రదేశ్‌లో బాగా తిరిగాను.
జనాలు లేరు
అప్పుడు కొన్ని థియేటర్లకు వెళ్లి చూస్తే జనాలు కనిపించలేదు. ఏ స్టార్ హీరో సినిమా రిలీజైనా సరే థియేటర్‌దాకా రావడం లేదు. సెకండ్ షోలు క్యాన్సిల్ చేశారు. సినిమా పరిస్థితి దారుణంగా ఉంది. అది స్వయంగా నా కళ్లతో చూశాను. ఇలాంటి పరిస్థితిలో ఇంతమంది కొత్తవాళ్లతో తీసిన సినిమా రిలీజ్ చేయాలంటే భయమేస్తోంది. స్టార్ హీరోల సినిమాలు చూసేందుకే ఎవరూ ముందుకు రావట్లేదు.. ఇక మన సినిమా ఎవరు చూస్తారని భయంగా ఉంది.
భయంగా ఉంది
ఏప్రిల్ 18న చౌర్యపాఠం తీసుకురావాలనుకున్నాం. ఆరోజు ఆరు సినిమాలు వస్తున్నాయి. అందుకే భయంతో దాన్ని ఈ నెల 25కు వాయిదా వేశాం. సాయంత్రమైతే జనాలు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. కేవలం క్రికెటే కారణమని చెప్పడం లేదు కానీ జనాలు థియేటర్లకు రావడం లేదు. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నామా? ఏంటనేది అర్థం కావడం లేదు.
అంత డబ్బు లేదు
నిర్మాతగా మారాక వాళ్ల కష్టాలన్నీ అర్థమవుతున్నాయి. అందుకే నిర్మాతలపై విపరీతమైన గౌరవం పెరిగింది. ఇప్పటికే ఉన్నదంతా పెట్టేశాను. మిగతావారిలా భారీగా ఖర్చుపెట్టి పబ్లిసిటీ చేయలేను. అంత డబ్బు లేదు. థియేటర్‌కు వచ్చి సినిమా చూడండి అని నక్కిన త్రినాథరావు అభ్యర్థించాడు. ఈయన చివరగా డైరెక్ట్ చేసిన మజాకా మూవీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన సంగతి తెలిసిందే!
చదవండి: నాన్న ఆస్తిపై నా భార్య కుట్ర.. ఆయన పాడె మోసేందుకు ఎవరూ రాలేదు