ఓటీటీకి టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Vishwak Sen Gaami Movie Ott Release Date Fix Goes Viral | Sakshi
Sakshi News home page

Gaami Movie Ott Release: విశ్వక్ సేన్ 'గామి'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Published Wed, Apr 3 2024 2:46 PM | Last Updated on Wed, Apr 3 2024 3:15 PM

Vishwak Sen Gaami Movie Ott Release Date Fix Goes Viral - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలే గామి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీలో అఘోరా పాత్రలో మెప్పించారు. శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన గామి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. విద్యాధర్ కాగిత అనే యువ దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైన గామి సినిమాను దాదాపు  ఆరేళ్ల పాటు తెరకెక్కించారు.

ఈ సినిమా సూపర్ హిట్‌ కావడంతో టాలీవుడ్‌ ఫ్యాన్స్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారంలోనే ఓటీటీకి రానుందని రూమర్స్ కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ట్వీట్ చేసింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement