
ఘనంగా హోమం, జలాదివాసం
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి ఆలయ ప్రతిష్ఠాపనలో భాగంగా మంగళవారం ఉదయం ఆవాహిత దేవతా మండల మూల మంత్ర హోమములు, విగ్రహ స్నపనము, జలాధివాసం కార్యక్రమాన్ని భద్రకాళి దేవాలయం ప్రధాన అర్చకులు రామకృష్ణ ఘనంగా నిర్వహించారు. సాయంత్రం శయ్యాధివాసము, ధాన్యాధివాసము ఫల పుష్ప ఆదివాసములను విగ్రహాలకు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి విరాళాలు ఇచ్చిన దాతలు ప్రత్యేక హోమాలను నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక హోమశాలను ఏర్పాటు చేసి వేదమంత్రాల మధ్య దంపతులతో హోమాలు చేపట్టారు.
నేడు అయ్యప్పస్వామి ఆలయ ప్రతిష్ఠాపన
మండల కేంద్రంలోని ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో అయ్యప్ప పంచలోహవిగ్రహంతో పాటు ఇతర విగ్రహాలను బుధవారం ఉదయం 11గంటలకు ప్రతిష్ఠించనున్నట్లు బ్రహ్మశ్రీ మల్లావజ్జల రామకృష్ణశర్మ తెలిపారు. గ్రామంలోని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. అలాగే ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనతో పాటు శివలింగం, మాలికపురత్తమ్మ, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నాగేంద్రస్వామి, గణపతి, నందీశ్వరులకు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే మహా అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ఘనంగా హోమం, జలాదివాసం

ఘనంగా హోమం, జలాదివాసం