
కోదాడ : టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయన సతీమణి పద్మావతిరెడ్డి జంటగా మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2014 ఎన్నికల్లో కోదాడ నుంచి పద్మావతి, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాసనసభ్యులుగా గెలుపొంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
2018లో కోదాడలో పద్మావతి ఓడిపోగా.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ గెలుపొందారు. తాజాగా 2023 ఎన్నికల్లో కోదాడ నుంచి పద్మావతిరెడ్డి గెలుపొందగా, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ మరోసారి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో వీరిద్దరూ రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం.