
భూ భారతి చట్టం.. చరిత్రాత్మకం
దేవరకొండ, చింతపల్లి: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం చరిత్రాత్మకమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి రైతు వేదికలో, చింతపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి అవగాహన సదస్సుల్లో వారు మాట్లాడారు. భూవివాదాలు లేని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు. ప్రతి రైతుకూ మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. భూ భారతి చట్టంపై గ్రామ గ్రామాన రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం రెవెన్యూ యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు. ఈ సదస్సుల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఏఎస్పీ మౌనిక, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఆర్డీఓ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలుసంజీవరెడ్డి, తహసీల్దార్ శర్మ, ఎంపీడీఓ సుజాత, అగ్రికల్చర్ ఏడీ శ్రీలక్ష్మి, ఏఓ శ్రావణి కుమారి, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, వేణుధర్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్